వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. అంబటి రాంబాబు తాజా పరిస్థితులను జగన్‌కు వివరించారు. ఈ టైంలో ఏర్పడిన రాజకీయ పరిణామాలపై జాగ్రత్తగా ఆలోచించి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రణాళికలపై చర్చ జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, శనివారం అంబటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు.