విజయవాడలో సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. క్రాంతికుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో సీఐ నాగరాజు తనను వేధిస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.