తాడేపల్లిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీలపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ప్రకాశం జిల్లా దర్శిలో, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఇలాంటి ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ శ్రేణులు ఈ ఫ్లెక్సీలను తొలగించగా, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సీబీఐ నివేదికలో లడ్డూ ప్రసాదంలో కల్తీ లేదని తేలినప్పటికీ, టీడీపీ ఈ ప్రచారాన్ని కొనసాగిస్తోందని వైసీపీ ఆరోపించింది. చంద్రబాబు చేసిన ఆరోపణలను న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయని పేర్కొంది.