బీజేపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు

22325చూసినవారు
బీజేపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు
AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైసీపీకి కౌన్సిలర్లు షాకిచ్చారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ సహా ఐదుగురు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో వారు పార్టీలో చేరారు. రాయదుర్గం మున్సిపల్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస యాదవ్, కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్, ఏటూరి రమేశ్, గోవిందరాజులు, వన్నూరప్పలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్