AP: వైసీపీ మరో మెట్టు దిగజారిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. టీచర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైసీపీ చర్యలను ఆయన ఖండించారు. ఫేక్ హ్యాండిల్స్ ద్వారా ఫేక్ విషయాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో పని చేస్తున్న టీచర్లు మద్యం తాగి బెంచీల కింద పడుకుంటున్నారని పోస్టు చేశారని, అది ఏ రాష్ట్రంలోనో జరిగిందన్నారు. గురువుల పట్ల వైసీపీ చేస్తున్న ఆరోపణలు క్షమించరాని నేరమన్నారు.