AP: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతకు నిరసనగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్, ఆటోను తాడుతో లాక్కుంటూ వచ్చి నిరసన తెలిపారు. దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్లోని పెట్రోల్ బంకు వద్ద జరిగిన ఈ ఆందోళనలో, చంద్రబాబు ప్రభుత్వం చేతకానిదని, ప్రజలకు పెట్రోల్, డీజిల్ కూడా ఇవ్వలేకపోతుందని దేవినేని అవినాష్ ఆరోపించారు.