గుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. వైసీపీ 'మాస్ పార్టీ'గా అభివర్ణించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రానున్న 45 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుధాకరబాబు మాట్లాడుతూ, వైసీపీ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.