AP: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అంశంపై
వైసీపీ తీరును ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు.
టీడీపీ బీసీలకు అండగా నిలిచిందని, కూటమి ప్రభుత్వం 34% రిజర్వేషన్లు ఇస్తే
వైసీపీ 24 శాతానికే పరిమితం చేసిందని ఆరోపించారు. రిజర్వేషన్లను అడ్డుకోవడానికి
వైసీపీ కోర్టులకు వెళ్తోందని, అందుకే ప్రజలు దానిని 'గొడ్డలి పార్టీ' అని పిలుస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌కి అబద్ధం చెప్పడం రాదని, జగన్‌కి నిజం చెప్పడం చేతకాదని దుయ్యబట్టారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు మరింత బుద్ధి చెప్తారని హెచ్చరించారు.