‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌’కి వైసీపీ వ్యతిరేకం కాదు: బాలరాజు (వీడియో)

18చూసినవారు
AP: ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’కి తాము వ్యతిరేకం కాదని వైసీపీ నేత, మాజీ మంత్రి బాలరాజు అన్నారు. గురువారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడ ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌’ పెట్టడానికి మేము వ్యతిరేకం. ఆ ఎక్స్‌లెన్స్‌ను వేరే చోట పెట్టండి. మేమూ స్వాగతిస్తాం. వాస్తవాలను దాచేస్తున్న కూటమి ప్రభుత్వం.. వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్