వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: సీఎం రమేశ్

33చూసినవారు
AP: రాష్ట్రంలో 13 మెడికల్ కళాశాలల నిర్మాణ పనులు 20 శాతం కూడా పూర్తికాలేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను పూర్తి చేయలేదని జగన్ భావించాడని పేర్కొన్నారు. పీపీపీ విధానం కొత్తదేమీ కాదని, 2014-19 టీడీపీ ప్రభుత్వంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ అభివృద్ధి కోసం పీపీపీ పద్ధతిలో అపోలోకు ఇచ్చారన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోనూ పీపీపీ విధానం అందుబాటులో ఉందన్నారు.

ట్యాగ్స్ :