AP: వైసీపీపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయలసీమ పేరును కేవలం రాజకీయాల కోసమే వైసీపీ వాడుకుందని మండిపడ్డారు. వైఎస్ హయాంలో యాత్రలు చేసినా, సీమ ప్రాజెక్టుల విషయంలో ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులు కట్టకుండా కేవలం టెస్టింగ్ కోసమే తవ్వుతున్నామంటూ కోర్టుల్లో అఫిడవిట్లు ఇచ్చి సీమకు అన్యాయం చేశారన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే వైసీపీ నైజమని విమర్శించారు.