AP: డ్రగ్స్ కేసులో వైసీపీ నేత కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో ఈగల్ టీమ్, టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు చేశారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న చరణ్ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. వైసీపీ స్టూడెంట్ వింగ్ విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి, అతడి స్నేహితులకు డ్రగ్స్ అమ్మేందుకు వచ్చినట్లు చరణ్ విచారణలో తెలిపాడు. చరణ్ ఇచ్చిన సమాచారం మేరకు కొండారెడ్డితో పాటు నలుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు.