వైసీపీ నేత చింతాడకు 14 రోజుల రిమాండ్

13చూసినవారు
వైసీపీ నేత చింతాడకు 14 రోజుల రిమాండ్
AP: శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఎస్సైపై అనుచిత ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో చింతాడను అంపోలులోని జిల్లా జైలుకు తరలించారు. జగన్ పర్యటన సందర్భంగా బందోబస్తుకు వచ్చిన ఎస్సైను చింతాడ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చుట్టుముట్టి, విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు అందడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్