AP: చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదని, మద్యం కుటీర పరిశ్రమలు భారీగా పెరిగాయని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆరోపించారు. ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, వైన్లు, బార్లు, బెల్టు షాపులు కనిపిస్తున్నాయని, ములకలచెరువులో కూడా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి నకిలీ మద్యం తయారు చేస్తున్నా పోలీసులు పట్టుకోలేదని, పాల వ్యాను జయచంద్రారెడ్డి అనుచరుడిదే అని తేలిందని, భారీ స్కామ్‌కు కారకుడైన జయచంద్రారెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదని నిలదీశారు.