AP: YCP యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీంకు పట్టుబడినట్లు హోంమంత్రి అనిత గురువారం మీడియా ఎదుట తెలిపారు. "కొండారెడ్డి యువతకు డ్రగ్స్ ఇస్తున్నారు. అయినా సరే జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు..? డ్రగ్స్ వద్దు బ్రో అని మేం అంటుంటే, వైసీపీ నేతలు “డ్రగ్స్ కావాలి బ్రో” అంటున్నారు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. తప్పు చేసే వారు ఎవరైనా సరే పార్టీ సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం" అని హోంమంత్రి హెచ్చరించారు.