టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతలు దాడి

6874చూసినవారు
టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతలు దాడి
AP: వైసీపీ నేతలు రెచ్చిపోయారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో టీడీపీ కార్యకర్త ఎలమంచిలి సురేశ్‌‌పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నేతలు మైలా శివకుమార్, పీతా నవీన్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సురేశ్‌పై దాడికి నిరసనగా బొబ్బర్లంక వద్ద ఆయన బంధువులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్