టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. క్లారిటీ

13723చూసినవారు
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. క్లారిటీ
AP: వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ మీడియా ఛానల్‌లో వైసీపీకి చెందిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పార్టీ మారబోతున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన స్పందించారు. పార్టీని వీడటంపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీమారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. రాజకీయాలు వదిలేస్తాను కానీ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తాను, రేగం కుటుంబం కట్టె కాలే వరకు జగనన్నతోనే ప్రయాణం కొనసాగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్