AP: అల్లూరి సీతారామరాజు జిల్లా రాజకీయాల్లో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు లక్ష్యంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ను పొగుడుతున్నారని, ఆయన ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న దేవుడిలా కనిపిస్తున్నారని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారం తన వ్యక్తిత్వాన్ని, పార్టీని దెబ్బతీస్తుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చూడరని, అలాంటిది రాజకీయ ప్రత్యర్థి అయిన
జనసేన అధ్యక్షుడిని ఎలా పొగుడుతానని ఆయన ప్రశ్నించారు.