AP: అసలు నెయ్యి వాడకుండానే దాని పేరుతో YSRCP ప్రభుత్వం రూ.250కోట్ల కుంభకోణానికి పాల్పడిందని జనసేన ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేసింది. 'ఆవు నెయ్యికి బదులు ప్రమాదకర రసాయనాలతో 68 లక్షల కిలోల సింథటిక్ నెయ్యి వాడి లడ్డూ ప్రసాదాన్ని TTD గత పాలకులు దోపిడీకి కేంద్రంగా చేసుకున్నారు. నెయ్యి సేకరణలో కుట్ర, ఫేక్ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగంపై ఆధారాలున్నట్టు CBI నేతృత్వంలోని SIT దర్యాప్తులో తేలింది' అని వెల్లడించింది.