వైసీపీ అరాచక చర్యలు సమాజంలో చీలిక తెస్తున్నాయి: మంత్రి నాదెండ్ల

5996చూసినవారు
వైసీపీ అరాచక చర్యలు సమాజంలో చీలిక తెస్తున్నాయి: మంత్రి నాదెండ్ల
AP: వైసీపీ‌పై మంత్రి నాదెండ్ల మనోహర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో వైసీపీఅరాచక చర్యలు సమాజంలో చీలిక తెస్తున్నాయని ఆరోపించారు. అరాచక చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పట్ల వైఎస్ఆర్‌సీపీకి గౌరవం లేదని, కోవిడ్ సమయంలో వారిని మద్యం షాపుల వద్ద డ్యూటీలకు నిలబెట్టారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీల మధ్య వ్యత్యాసం తెలియకపోవడం శోచనీయమని, డీఎస్సీ నిర్వహణపై అవకతవకలు జరిగితే శాసనసభకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్