AP: అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాల దాడిని YCP సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్‌ఆర్‌ఐ వింగ్, తీవ్రంగా ఖండించింది. కూటమి సర్కార్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని, దీనివల్ల రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధ్వంసం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని, దీనికి పాల్పడినవారు చట్టం ముందు జవాబుదారీగా నిలబడతారని పార్టీ కన్వీనర్ సయ్యద్ రబ్బానీ తెలిపారు.