AP: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ
వైసీపీ విద్యార్థి విభాగం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజీపై విచారణ చేయాలన్నారు. అలాగే డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.