భారత టెన్నిస్ క్రీడాకారుడు యూకీ భాంబ్రీ ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్‌లో అత్యుత్తమంగా 20వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్ వరకు చేరుకోవడం ద్వారా లభించిన పాయింట్లు అతడిని ఈ అరుదైన మైలురాయికి చేర్చాయి. రోహన్ బోపన్న తర్వాత ఏటీపీ డబుల్స్ టాప్-20 ర్యాంక్ సాధించిన తొలి ఇండియన్‌గా యూకీ నిలిచాడు. గత ఏడాది కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యూకీ, తన తొలి ఏటీపీ 500 టైటిల్‌ను గెలుచుకోవడంతో పాటు యూఎస్ ఓపెన్ సెమీఫైనల్స్ వరకు వెళ్ళాడు.