రిటైర్మెంట్‌ ప్రకటించడానికి కారణం చెప్పిన యువరాజ్‌ సింగ్‌

5521చూసినవారు
రిటైర్మెంట్‌ ప్రకటించడానికి కారణం చెప్పిన యువరాజ్‌ సింగ్‌
టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి గల కారణాలను తాజాగా వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో పాటు ఆటను ఆస్వాదించలేకపోవడం, సరైన గౌరవం-మద్దతు లభించలేదన్న భావనే రిటైర్మెంట్‌కు దారితీసిందన్నాడు. మానసికంగా, శారీరకంగా ఇక ముందుకు సాగలేనని అనిపించడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు సానియా మీర్జాతో ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పాడు. యువరాజ్‌ కెరీర్‌లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్