వైద్యులు ఇచ్చిన ధైర్యంతో క్యాన్సర్‌ను జయించాను: యువరాజ్ సింగ్

4929చూసినవారు
వైద్యులు ఇచ్చిన ధైర్యంతో క్యాన్సర్‌ను జయించాను: యువరాజ్ సింగ్
భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ తన క్యాన్సర్ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. 2011 ప్రపంచ కప్ తర్వాత తనకు క్యాన్సర్ సోకిందని, వైద్యులు 3-6 నెలల సమయం మాత్రమే ఉందని చెప్పారని తెలిపారు. ఊపిరితిత్తుల మధ్యలో కణితి ఏర్పడటంతో వెంటనే కీమోథెరపీ చేయించుకోకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. అమెరికాలో చికిత్స పొందుతూ డాక్టర్ లారెన్స్ ఐన్‌హార్న్ ఇచ్చిన ధైర్యంతో ఆయన క్యాన్సర్‌ను జయించి, 2012లో భారత జట్టులోకి పునరాగమనం చేశారు. నేడు ఆయన YouWeCan ఫౌండేషన్ ద్వారా వేలాది మంది క్యాన్సర్ రోగులకు ఆశలు నింపుతున్నారు.

సంబంధిత పోస్ట్