లడ్డూ ప్రసాదంపై ప్రచారం ఖండించిన వైవీ సుబ్బారెడ్డి

6539చూసినవారు
లడ్డూ ప్రసాదంపై ప్రచారం ఖండించిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వాడకంపై జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ల్యాబ్ నివేదికలు రాకముందే మీడియా లీకులు, రాజకీయ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, భక్తుల విశ్వాసాలను దెబ్బ తీయొద్దని ఆయన కోరారు. వైసీపీని దెబ్బతీయడానికి తిరుమల పవిత్రతను వాడుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్