AP: వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం రాత్రి అరెస్టు చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న, వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు ఆయన పీఏగా పనిచేశారు. అలాగే, జగన్ పాలనలో దిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రొటోకాల్ ఓఎస్డీగా కూడా అప్పన్న బాధ్యతలు నిర్వహించారు.