పాలనా వ్యవస్థలో 'జీరో కరప్షన్'.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

4687చూసినవారు
పాలనా వ్యవస్థలో 'జీరో కరప్షన్'.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP: ఏ శాఖలో ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని.. జీరో కరెప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని.. అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏడాది పాలనపై, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
Job Suitcase

Jobs near you