AP: సీఎం చంద్రబాబుపై
వైసీపీ అధినేత
జగన్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ.లక్ష కోట్లు అని చంద్రబాబు అంటున్నారు. కానీ హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే పట్టించుకోవడం లేదు. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఇన్పుట్ సబ్సిడీని నిర్వీర్యం చేసి రైతుల నడ్డీ విరిచారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మీరే అడ్డుపడుతున్నారు. రాయలసీమలో బోర్లు ఎండిపోయాయి. రైతులు ట్యాంకర్ నీటితో రూ.1,500 నుంచి రూ.2 వేలు ఖర్చు చేసి చెట్లకు నీరు పోస్తున్నారు’ అని
జగన్ ట్వీట్ చేశారు.