రెండో ట్రిలియనీర్‌గా జుకర్‌‌బర్గ్‌‌!

12420చూసినవారు
రెండో ట్రిలియనీర్‌గా జుకర్‌‌బర్గ్‌‌!
ప్రపంచంలో రెండో ట్రిలియనీర్‌గా అవతరించేందుకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌‌బర్గ్‌‌కే అత్యధిక అవకాశాలున్నాయని ప్రిడిక్షన్ మార్కెట్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. స్పేస్‌‌ఎక్స్ ఐపీఓతో ఎలాన్ మస్క్‌‌ మొదటి ట్రిలియనీర్‌గా నిలిచిన నేపథ్యంలో, జుకర్‌‌బర్గ్‌‌కు 32శాతం అవకాశం ఉందని బెట్టింగ్ ప్లాట్‌‌ఫారమ్ 'కాల్షి'లోని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తి 200 బిలియన్ డాలర్లు. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌‌కు 21శాతం, డెల్ టెక్నాలజీస్ ఫౌండర్ మైఖేల్ డెల్‌కు 6శాతం అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో మెటా కంపెనీ ఏఐ వ్యాపార వృద్ధి అవకాశాలను బట్టి జుకర్‌‌బర్గ్‌‌కు ఈ అంచనా కట్టబెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్