ఒక్క బ్లెడ్ టెస్ట్‌తో 10 రకాల క్యాన్సర్ల గుర్తింపు!

10266చూసినవారు
ఒక్క బ్లెడ్ టెస్ట్‌తో 10 రకాల క్యాన్సర్ల గుర్తింపు!
ఒకే రక్త పరీక్షతో 10 రకాల క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించే 'షీల్డ్ MCD' (మల్టీ-క్యాన్సర్ డిటెక్షన్) టెస్ట్ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. జైడస్ లైఫ్‌సైన్సెస్, అపోలో హాస్పిటల్స్, గార్డెంట్ హెల్త్ భాగస్వామ్యంతో ఈ స్క్రీనింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది రొమ్ము, పెద్ద పేగు, ఊపిరితిత్తులు, కాలేయం, అండాశయ, మూత్రాశయ, క్లోమ, ప్రొస్టేట్, అన్నవాహిక, జీర్ణాశయ క్యాన్సర్లను గుర్తిస్తుంది. 45 ఏళ్లు పైబడిన వారికి ఇది ఉపయోగకరం. రక్తంలోని డీఎన్‌ఏలో 'మిథైలేషన్' మార్పులను విశ్లేషించి క్యాన్సర్ ఉనికిని సూచిస్తుంది. అయితే ఇది తుది పరీక్ష కాదు, పాజిటివ్‌గా వస్తే మరిన్ని వైద్య పరీక్షలు అవసరం.

సంబంధిత పోస్ట్