
తిరుచానూరులో ఏడేళ్ల గిరిజన చిన్నారిపై లైంగిక దాడి
తిరుపతి జిల్లా తిరుచానూరులో ఏడేళ్ల గిరిజన బాలికపై లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. చాక్లెట్ ఆశ చూపి నాగరాజు (30) అనే వ్యక్తి బాలికపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
























