
రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయో తెలుసా?
రైల్వే స్టేషన్లలో రెండు ట్రాక్‌లు కలిసే లేదా విడిపోయే చోట ఉండే తెల్లటి కాంక్రీట్ దిమ్మెలపై 'FM' అని రాసి ఉంటుంది. దీనిని ఫౌలింగ్ మార్క్ అంటారు. రైలు ఇంజిన్లు లేదా బోగీలు పట్టాల కంటే వెడల్పుగా ఉండటం వల్ల, లూప్ లైన్ లోకి వచ్చిన రైలు ఈ ఫౌలింగ్ మార్క్‌ను దాటి ఆగితే, పక్కనున్న మెయిన్ లైన్‌లో వచ్చే మరో రైలును ఢీకొనే ప్రమాదం ఉంది. లోకో పైలట్లు, గార్డులకు తమ రైలు సురక్షితమైన దూరంలో ఆగిందా లేదా అని తెలియజేయడానికి ఈ మార్క్ సూచనగా పనిచేస్తుంది. ఇది రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా నివారించే ముఖ్యమైన భద్రతా హద్దు.
























