
వరకట్న వేధింపులపై గవర్నర్ మనవడి భార్య ఫిర్యాదు
కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ భార్య దివ్య గెహ్లాట్, తన భర్తకు మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వరకట్నం కోసం తనను వేధించడంతోపాటు, తన నాలుగేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేసి అత్తమామల వద్ద బలవంతంగా ఉంచుకున్నారని ఆమె మధ్యప్రదేశ్‌లోని రత్లాం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పెళ్లి నాటి నుంచి రూ.50 లక్షల కట్నం డిమాండ్ చేశారని, గర్భవతిగా ఉన్నప్పుడు, బిడ్డ పుట్టిన తర్వాత కూడా తనను కొట్టి, మానసికంగా హింసించారని దివ్య ఆరోపించారు.




