
ఈ నంబర్లు సేవ్ చేసుకోండి: హోంమంత్రి అనిత (వీడియో)
AP: రాష్ట్రానికి మొంథా తుఫాన్ ముప్పు పొంచి ఉందని, కోస్తా తీరం వెంబడి జిల్లాల్లో రేపు, ఎల్లుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హోంమంత్రి అనిత అన్నారు. తుఫాన్ ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదని అధికారులను ఆదేశించారు. అతి తక్కువ ఆస్తి నష్టం ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. స్టేట్ కంట్రోల్ రూమ్ 112, 1070, 18004250101 నంబర్లను ప్రజలందరూ సేవ్ చేసుకోవాలని సూచించారు. ఏ సహాయమైనా రాష్ట్ర, జిల్లాల కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.




