
చేవెళ్ల అగ్నిప్రమాదంలో తల్లీ, కూతురు మృతి(వీడియో)
TG: అగ్నిప్రమాదంలో తల్లీ, కూతురు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణదాస్ గూడ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో శ్రీనివాస్ భార్య లావణ్య, కుమార్తె ప్రార్ధనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.



















