
ముగ్గురి చేతుల్లో ఇరాన్ పాలన .. కొత్త సుప్రీం లీడర్ ఎంపికపై సర్వత్ర ఆసక్తి
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిలో మరణించారు. దీంతో 36 ఏళ్ల ఖమేనీ శకం ముగిసింది. ఆయన మరణంతో దేశం తీవ్ర అనిశ్చితిలో కూరుకుపోయింది. రాజ్యాంగం ప్రకారం, ప్రస్తుత అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ప్రధాన న్యాయమూర్తి ఘోలం హుస్సేన్ మొహ్సేనీ-ఎజెయ్, గార్డియన్ కౌన్సిల్ ప్రతినిధితో కూడిన ముగ్గురు సభ్యుల తాత్కాలిక కమిటీ పాలనా బాధ్యతలను చేపట్టింది. కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే ప్రక్రియను ‘అసెంబ్లీ ఆఫ్ లీడర్‌షిప్ ఎక్స్‌పర్ట్స్’ చేపట్టనుంది. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.




