
నాడు - నేడు స్కూళ్ల కోసం విరాళాల సేకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'నాడు - నేడు' పథకం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విరాళాల సేకరణకు ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విరాళాల సేకరణ కోసం ఒక ప్రత్యేక డోనార్ పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల ద్వారానే నిధులు సమకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.






























