
మాధవ్ హీరోగా 'మారెమ్మ' ప్రీరిలీజ్.. రవితేజ ప్రశంసలు!
నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న 'మారెమ్మ' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ మైసాపురం బ్యాక్‌డ్రాప్‌లో యథార్థ సంఘటనలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం చాలా బాగుందని, యంగ్ టాలెంట్‌ను ఆదరించాలని రవితేజ కోరారు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మోక్ష ఆర్ట్స్ నిర్మించిన ఈ విలేజ్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.






























