
పెళ్లి చేయడం లేదని.. హైటెన్షన్ టవర్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య(వీడియో)
TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో ఇంట్లో వారు తనకు పెళ్లి చేయడం లేదంటూ గుర్తు తెలియని వ్యక్తి హైటెన్షన్ టవర్ పైనుంచి దూకిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.




