
రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి.. వధువుని పెళ్లాడిన సోదరుడు (వీడియో)
బిహార్లో పెళ్లి వేదికకు బయలుదేరిన ఒక వరుడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషాదంతో పెళ్లిని రద్దు చేయలేక, వధువు భవిష్యత్తు, సామాజిక గౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో పెద్దల అంగీకారంతో మృతుడి సోదరుడు వధువును వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటనతో పెళ్లి వేదికపై వధువు, మృతుడి సోదరుడు కన్నీటిపర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.




