
గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
పశ్చిమాసియాలో ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో విమాన సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భద్రతా కారణాలతో ఎయిర్ ఇండియా, ఇండిగో తదితర సంస్థలు గల్ఫ్ దేశాలకు వెళ్లే పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశాయి. దీంతో దుబాయ్, అబుదాబి మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గగనతలం అస్థిరత, యూఏఈ ఆంక్షలే కారణమని అధికారులు తెలిపారు. రద్దైన టికెట్లకు రిఫండ్ లేదా రీషెడ్యూల్ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.




