
SMAT గెలవడంలో ధోనీ కీలక పాత్ర!
ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో ఝార్ఖండ్ జట్టు తొలిసారిగా విజేతగా నిలిచింది. ఈ విజయంలో దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించారని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి షాబాద్ నదీమ్ వెల్లడించారు. SMAT సీజన్ ప్రారంభానికి ముందు ధోనీ సలహాతోనే కోచింగ్ స్టాఫ్ నియామకాలు జరిగాయని, జట్టులోని ఆటగాళ్ల బలాబలాలను తెలుసుకొని ఆయన సూచనలు అందించేవారని నదీమ్ తెలిపారు.




