
ఏపీలో రెండు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటన
AP: మొంథా తుఫాను కారణంగా పంటలు, ఆస్తులు భారీగా నష్టపోయిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT) రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించనుంది. ఈ బృందం సోమవారం బాటప్ల, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో, మంగళవారం ప్రకాశం, కోనసీమ జిల్లాల్లో పర్యటించి తుపాను ప్రభావాన్ని ప్రత్యక్షంగా ఆవలోకనం చేయడంతో పాటు బాధితులతో సమావేశమవుతుందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.




