
విజయవాడలో కృష్ణా నదిపై మరో భారీ రైల్వే బ్రిడ్జి
విజయవాడలో రైళ్ల రాకపోకలను సులభతరం చేసేందుకు కృష్ణా నదిపై మూడో రైల్వే వంతెనను నిర్మించనున్నారు. బల్లార్ష-విజయవాడ-గూడూరు నాలుగో లైన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ-కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య 1.3 కిలోమీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తారు. రూ.5,858 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల గూడ్స్ మరియు ప్రయాణీకుల రైళ్లు ఆటంకం లేకుండా నేరుగా విజయవాడ స్టేషన్కు చేరుకోగలవు. ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్ రైల్వే బోర్డుకు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.




