
వీసా ప్రాసెసింగ్‌లో జాప్యం.. 18 నెలలుగా భారత్‌లోనే టెకీ
హెచ్-1బీ వీసా ప్రక్రియలో ఆలస్యం కారణంగా టీసీఎస్ ఉద్యోగి నవదీప్ శర్మ 18 నెలలుగా భారత్‌లోనే ఉంటున్నారు. ఆయన భార్యాపిల్లలు అమెరికాలోనే ఉండిపోయారు. ఈ జాప్యాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన దావాను యూఎస్ న్యాయస్థానం తోసిపుచ్చింది. 2025లో వీసా ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన అభ్యర్థన తిరస్కరణకు గురైంది. అనంతరం పలుమార్లు వైద్యపరీక్షలు చేయించుకున్నా, వీసా మళ్లీ రిజెక్ట్ అయింది. దీంతో యూఎస్ విదేశాంగ శాఖ అధికారులపై కేసు వేసినా, కేవలం విదేశాంగ శాఖ అధికారులపై మాత్రమే కేసు వేయడానికి అర్హత ఉందని కోర్టు పేర్కొంది.





























