
2029లోగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: మోదీ
ప్రజాస్వామ్యాన్ని మహిళలు బలోపేతం చేస్తారని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సోమవారం జరిగిన నారీ శక్తి వందన సమ్మేళనంలో మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం తర్వాత మహిళల రిజర్వేషన్ల బిల్లు వస్తోందన్నారు. 2029లోగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. మహిళల రిజర్వేషన్ల కోసమే పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం అవుతుందన్నారు.































