
ఖర్జూర సాగుతో కోట్లలో లాభం
TG: మెదక్ జిల్లా రామాయంపేట మండలానికి చెందిన సత్యనారాయణ అనే రైతు ఖర్జూర సాగుతో లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నాడు. 2019లో లండన్ నుంచి 280 మొక్కలను దిగుమతి చేసుకుని నాటిన ఆయన, 2023 నుంచి అద్భుతమైన దిగుబడి సాధిస్తున్నాడు. ప్రస్తుతం ఇరాన్ నుంచి మరో 750 మొక్కలను తెప్పించి సాగును విస్తరించాడు. డ్రిప్ సిస్టమ్ ద్వారా తక్కువ నీటితోనే అధిక దిగుబడి సాధిస్తూ, కిలో రూ.100 చొప్పున తోట వద్దే పండ్లను విక్రయిస్తూ ఏటా లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఈ ఖర్జూర సాగులో పెట్టుబడి పెడితే 60-80 ఏళ్ల వరకు నిరంతరాయంగా ఫలసాయం అందుతుందని ఆయన తెలిపారు.































