
రైతులకు గుడ్ న్యూస్.. తాకట్టు లేకుండానే రూ.2 లక్షల రుణం
కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. రుణాల ఆమోదం, తిరిగి చెల్లింపు విధానాల్లో దేశవ్యాప్తంగా ఏకరూపత తీసుకురావడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం రైతులు తీసుకునే రూ.2 లక్షలలోపు రుణాలకు తాకట్టు, మార్జిన్ మనీ, అదనపు సెక్యూరిటీ నిబంధనలను తొలగించింది. ఈ నిర్ణయంతో రైతులకు సులభంగా రుణాలు అందే అవకాశం ఉంది.




