వీడియోలు

ఉప్పుకి బదులుగా మధ్యాహ్న భోజనంలో సర్ఫ్.. 20 మందికి అస్వస్థత (వీడియో)

బిహార్‌లోని నలంద జిల్లాలో మంగళవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అదనపు ఉప్పు అడిగిన విద్యార్థులకు డిటర్జెంట్ పౌడర్ (సర్ఫ్) కలిసిన ఆహారం వడ్డించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ భోజనం తిన్న 20 మందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. విషయం వెలుగులోకి రావడంతో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

అనంతపురం జిల్లా